Fri Dec 20 2024 01:24:51 GMT+0000 (Coordinated Universal Time)
Liqour Shops : నేడు లిక్కర్ షాపులు బంద్
దేశ రాజధాని ఢిల్లీలో నేడు మద్యం విక్రయాలను బంద్ చేశారు. మద్యం దుకాణాలను బంద్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
దేశ రాజధాని ఢిల్లీలో నేడు మద్యం విక్రయాలను బంద్ చేశారు. మద్యం దుకాణాలను బంద్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలో జరుగుతున్న ఛాత్ పూజల కారణంగానే మద్యం అమ్మకాలపై ఈరోజు నిషేధం విధించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఛాత్ పూజను ఢిల్లీలో విశేషంగా జరుపుకుంటారు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ రోజు పండగను చేసుకుంటున్న సందర్భంలో మద్యం దుకాణాలు బంద్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
ఛాత్ పూజల కారణంగా...
అయితే ఛాత్ పూజలు మొత్తం నాలుగు రోజుల పాటు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే మద్యం దుకాణాలు మాత్రం ఈరోజు ఒక్కరోజు మాత్రమే బంద్ అవుతాయని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఢిల్లీతో పాటు ఉత్తర్ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోనూ ఛాత్ పూజలను ఘనంగా నిర్వహిస్తారు కేవలం ఆదివారం మాత్రమే మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. రేపటి నుంచి యధాతధంగా మద్యం విక్రయాలు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
Next Story