Mon Dec 23 2024 10:36:19 GMT+0000 (Coordinated Universal Time)
జైలులో మజా.. వీడియో వైరల్
మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన సత్యేంద్ర జైన్ కు తీహార్ జైలులో అన్ని సదుపాయాలు అందుతున్నట్లు ఈ వీడియోను బట్టి తెలుస్తోంది
ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ జైలు నిబంధనలు ఉల్లంఘించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన సత్యేంద్ర జైన్ కు తీహార్ జైలులో అన్ని సదుపాయాలు అందుతున్నట్లు ఈ వీడియోను బట్టి తెలుస్తోంది. సత్యేంద్ర జైన్ కు తీహార్ జైలులో మసాజ్ చేస్తున్న వీడియో ఇప్పుడు కలకలం రేపుతుంది. బీజేపీ నేతలు ఈ వీడియోను బయట పెట్టారు.
మనీలాండరింగ్ కేసులో...
మనీలాండరింగ్ కేసులో శిక్ష అనుభవిస్తున్న సత్యేంద్ర జైన్ కు తీహార్ జైలులో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారని బీజేపీ నేత షెహజాద్ పూనావాలా ఆరోపించారు. ఆయన శిక్షకకు బదులుగా ఎంజాయ్ చేస్తున్నారని ట్వీట్ చేశఆరు. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉండటంతో జైలులో సకల సౌకర్యాలు ఆయనకు అందుతున్నాయని ఆయన ఆరోపించారు. అయితే ఇది పాత వీడియో అని జైలు అధికారులు కొట్టిపారేస్తున్నారు. ఇటీవలే జైలు సూపరింటెండెంట్ ను సస్పెండ్ చేసిన విషయాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు
Next Story