Sun Dec 22 2024 09:57:47 GMT+0000 (Coordinated Universal Time)
Savitri Jindal: భారతదేశపు అత్యంత సంపన్న మహిళ సావిత్రి ఎన్నికల ఫలితాలు ఇవే!!
స్వతంత్ర అభ్యర్థి, భారతదేశపు అత్యంత సంపన్న మహిళ సావిత్రి జిందాల్
స్వతంత్ర అభ్యర్థి, భారతదేశపు అత్యంత సంపన్న మహిళ సావిత్రి జిందాల్ ఎన్నికల్లో విజయాన్ని దక్కించుకున్నారు. హిసార్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 18,941 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆమె బీజేపీకి చెందిన కమల్ గుప్తా, కాంగ్రెస్ అభ్యర్థి రామ్ నివాస్ రారాపై విజయం సాధించారు. హిసార్ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ, సావిత్రి జిందాల్ ట్వీట్ చేశారు. జిందాల్ కుటుంబానికి చెందిన 74 ఏళ్ల సావిత్రి జిందాల్ మూడోసారి హిసార్‌లో గెలిచారు. గతంలో 2005, 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు.
2005లో తన భర్త OP జిందాల్ మరణం తర్వాత సావిత్రి జిందాల్ వ్యాపార, రాజకీయ ప్రపంచంలోకి అడుగు పెట్టారు. జిందాల్ గ్రూప్ యజమానిగా ఆమె పలు బాధ్యతలు చూసుకున్నారు. ఆమె భారతదేశ మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌తో సహా అంతర్జాతీయ గుర్తింపును కూడా పొందారు. సావిత్రి జిందాల్ 2005లో మొదటిసారిగా హర్యానా అసెంబ్లీకి కాంగ్రెస్ సభ్యురాలుగా ప్రాతినిధ్యం వహించారు. 2009లో తిరిగి ఎన్నికయ్యారు. 2013లో హర్యానా ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆమె మార్చిలో కాంగ్రెస్‌తో విడిపోయారు. ఫోర్బ్స్ ప్రకారం, సావిత్రి జిందాల్ వ్యక్తిగత సంపద ₹ 3.65 లక్షల కోట్లు. ఆమె భారతదేశంలో అత్యంత సంపన్న మహిళ. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ (సెప్టెంబర్ 28, 2024) ప్రకారం ఆమెకు $36.3 బిలియన్ల నికర ఆస్తి ఉంది.
Next Story