Thu Apr 10 2025 05:44:27 GMT+0000 (Coordinated Universal Time)
నిరుద్యోగులారా.. అలెర్ట్...సాయంత్రం వరకే గడువు... నేడే దరఖాస్తు చేసుకోండి
నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం గడువు నేటితో ముగియనుంది. పీఎం ఇంటర్నెట్షిప్ స్కీమ్ గడువు ముగియనుంది

నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం గడువు నేటితో ముగియనుంది. పీఎం ఇంటర్నెట్షిప్ స్కీమ్ గడువు ముగియనుంది. నవంబరు పదోతేదీన చివరి తేదీగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు సాయంత్రంలోగా రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తులను చేసుకోవాల్సి ఉంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను కార్పొరేట్ వ్యవహారా శాఖ మంత్రి ప్రకటించింది.
అర్హతలివే...
టెన్త్ క్లాస్, ఇంటర్మీడియట్ విద్యార్హతలు కలిగిన వారితో పాటు ఐటీఐ చదివిన వారు ఈ పీఎం ఇంటర్నెట్షిప్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా ఈ పథకం కింద తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంది. అభ్యర్థుల వయసు 21 నుంచి 24 ఏళ్ల వయసుకు మించి ఉండకూడదు. భారతీయ పౌరులయి ఉండాలి. వారే ఈ పీఎం ఇంటర్నెట్షిప్ స్కీమ్ కింద అర్హులని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
Next Story