Mon Dec 23 2024 08:42:56 GMT+0000 (Coordinated Universal Time)
బస్టాండ్లో స్కూల్ విద్యార్థినికి తాళి కట్టిన విద్యార్థి
కడలూరు పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన..
అందరూ చూస్తుండగా.. విద్యార్థిని మెడలో బస్టాండ్లో తాళి కట్టేశాడో విద్యార్థి. అది చూసినవారంతా షాకయ్యారు. ఈ ఘటన తమిళనాడులోని చిదంబరంలో జరిగింది. స్కూల్ యూనిఫారమ్ వేసుకుని ఉన్న విద్యార్థిని పక్కనే కూర్చున్న విద్యార్థి తనతో తెచ్చుకున్న తాళిని విద్యార్థిని మెడలో కట్టగా.. చుట్టూ ఉన్న స్నేహితులు వారిపై పూలు చల్లి సపోర్ట్ చేశారు. ఈ దృశ్యాలను తమ మొబైల్ లో తీసిన స్నేహితులు.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవికాస్తా వైరల్ అయ్యాయి.
దాంతో కడలూరు పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చిదంబరానికి చెందిన రచయిత బాలాజీ గణేశన్ ను అట్రాసిటీ నిరోధక చట్టం కింద అరెస్ట్ చేశారు. కాగా.. వీడియోలో విద్యార్థిని స్కూల్ యూనిఫారమ్ లో ఉండటంతో ఆమె మేజరా ? మైనరా ? అన్న విషయంపై పోలీసులు విచారణ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థిని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా.. ఆ విద్యార్థిని 12వ తరగతి చదువుతుండగా.. విద్యార్థి పాలిటెక్నిక్ చదువుతున్నట్లు తెలిసింది.
Next Story