Thu Nov 14 2024 06:58:27 GMT+0000 (Coordinated Universal Time)
School Holiday: స్కూళ్లకు సెలవు ప్రకటించిన అధికారులు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, IMD అలర్ట్ నేపథ్యంలో తమిళనాడులోని పలు ప్రాంతాలకు స్కూళ్లకు సెలవులు ఇచ్చారు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, IMD అలర్ట్ నేపథ్యంలో తమిళనాడులోని పలు ప్రాంతాలకు స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. చెన్నై నగరంలో పాఠశాలలకు ఈరోజు సెలవు ప్రకటించారు. నగరంలోని అన్ని పాఠశాలలకు జిల్లా కలెక్టర్ రష్మీ సిద్ధార్థ్ జగాడే సెలవు ప్రకటించారు. నవంబర్ నవంబర్ 13న తమిళనాడు లోని 17 జిల్లాలకు, నవంబర్ 14న 27 జిల్లాలకు, నవంబర్ 15న 25 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వాతావరణ పరిస్థితులను బట్టి పాఠశాలలకు సెలవు పొడిగిస్తారు. చెన్నై అడ్మినిస్ట్రేషన్ పబ్లిక్ రాకపోకలను తగ్గించడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని ఇవ్వాలని కంపెనీలను కోరింది.
చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా.. కాంచీపురం, రాణిపేట్, కడలూరు, మైలాడుతురై, నాగపట్నం, తంజావూరు, తిరువారూర్, అరియలూరు, పెరంబలూరు, విల్లుపురం, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం, తదితర ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
Next Story