Fri Nov 15 2024 08:27:22 GMT+0000 (Coordinated Universal Time)
జీశాట్-ఎన్2 ప్రయోగం జులైలో
జీశాట్-ఎన్2 ప్రయోగాన్ని జులై రెండో వారంలో ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు.
జీశాట్-ఎన్2 ప్రయోగాన్ని జులై రెండో వారంలో ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. 4,700 కేజీల బరువుండే ఈ ఉపగ్రహాన్ని స్పేస్ ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ ద్వారా స్పేస్‌లోకి పంపేందుకు అంతా సిద్ధం చేసినట్లు తెలిసింది.అయితే ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ శాస్త్రవేత్తలు మాత్రం జులై రెండో వారంలో దీనిని ప్రయోగించానలి భావిస్తున్నారు.
భారత్ కు సేవలు...
ఈ జీ శాట్ -ఎన్ 2 జీవితకాలం పథ్నాలుగు ఏళ్లు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. . దేశ బ్రాడ్ బ్యాండ్ కమ్యూ నికేషన్ అవసరాల కోసం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ జీ శాట్ -ఎన్ 2 రూపొందించింది.. అండమాన్ నికోబార్, లక్షద్వీప్ సహా భారత్ మొత్తానికి దీని సేవలు అందనున్నాయని తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story