Wed Jan 01 2025 09:03:27 GMT+0000 (Coordinated Universal Time)
ఇండియాలో రెండో యాపిల్ స్టోర్
భారత్ లో రెండో యాపిల్ స్టోర్ ప్రారంభమయింది. ఢిల్లీలో సెలెక్ట్ సిటీ వాక్ మాల్లో సీఈవో టిమ్ కుక్ ప్రారంభించారు
భారత్ లో రెండో యాపిల్ స్టోర్ ప్రారంభమయింది. ఢిల్లీలోని సాకేత్ లని సెలెక్ట్ సిటీ వాక్ మాల్లో ఈ యాపిల్ స్టోర్ ను సంస్థ సీఈవో టిమ్ కుక్ ప్రారంభించారు. ఇటీవల ముంబయిలో యాపిల్ స్టోర్ ప్రారంభయిన సంగతి తెలిసిందే. యాపిల్ సంస్థలకు భారత్ లో ఉన్న డిమాండ్ ను బట్టి మరో స్టోర్‌ను యాపిల్ సంస్థ ప్రారంభించింది.
ప్రధానితో భేటీ...
అయితే భారతదేశ పర్యటనలో ఉన్న యాపిల్ సీఈవో టిమ్ కుక్ ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. భారతదేశ భవిష్యత్తుకు సాంకేతికత ఏ విధంగా ఉపయోగపడనుంది అనే అంశంపై వారు చర్చించుకున్నారు. ఇద్దరి మధ్య సమావేశం నలభై నిమిషాలకు పైగానే సాగింది.
- Tags
- apple store
- delhi
Next Story