Thu Apr 03 2025 02:01:37 GMT+0000 (Coordinated Universal Time)
రెండో రోజుకు పార్లమెంటు సమావేశాలు.. అదానీ అంశం
నేడు రెండో రోజు కొనసాగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి

నేడు రెండో రోజు కొనసాగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈరోజు కూడా అదానీ అంశం ఉభయసభలను ఊపేసే అవకాశముంది. రెండు సభలు సజావుగా జరిగే అవకాశం కనిపించడం లేదు. విపక్షాలు అదానీ అవినీతిపై చర్యలపై చర్చించాలని పట్టుబడుతున్నాయి.
రాజ్యసభలోనూ...
నేడు రాజ్యసభలో " భారతీయ వాయుయాన్ విధేయక్ 2024 " బిల్లును కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రవేశపెట్టనున్నారు. అదానీ అంశంపై రెండు సభల్లో కాంగ్రెస్ వాయిదా తీర్మానాలను ఇచ్చింది. లోక్ సభలో మాణిక్కం ఠాగూర్, రాజ్యసభలో రణదీప్ సింగ్ సూర్జేవాలా వాయిదా తీర్మానం ఇచ్చారు. రెండో రోజు సభ హాట్ హాట్ గా సాగనుంది.
Next Story