Mon Dec 23 2024 09:12:57 GMT+0000 (Coordinated Universal Time)
Delhi : ఢిల్లీలో భారీ భద్రత .. మొహరించిన పారామిలటరీ బలగాలు
ఢిల్లీలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రేపు ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనుండటంతో భద్రతను పెంచారు
ఢిల్లీలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రేపు ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనుండటంతో వివిధ దేశాలకు చెందిన నేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి భవన్ వద్ద జరిగే ఈ ప్రమాణస్వీకారానికి దేశ, విదేశాలకు చెందిన అతిధులు హాజరుకానున్నారు.
రేపు సాయంత్రం...
ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు రాష్ట్రపతి భవన్ వేదికగా ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగనుంది. దీంతో ఆ ప్రాంతమంతా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు దిల్లీ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. పారామిలిటరీ బలగాలు, ఎన్ఎస్జీ కమాండోలు, డ్రోన్లు, స్నైపర్లను మొహరించారు. ఇక రాష్ట్రపతి భవన్ లోపల, బయట మూడు అంచెల భద్రతను ఏర్పాటుచేశారు.
Next Story