Sat Nov 23 2024 01:49:39 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ కు వస్తున్నానని చెప్పిన సీమా హైదర్ మొదటి భర్త
పాకిస్తాన్‌కు చెందిన సీమా హైదర్ భారతదేశంలో ఉంటోంది. ఆమె తన నలుగురు పిల్లలతో కలిసి
పాకిస్తాన్‌కు చెందిన సీమా హైదర్ భారతదేశంలో ఉంటోంది. ఆమె తన నలుగురు పిల్లలతో కలిసి అక్రమంగా భారత్ లోకి వచ్చేసింది. దీనిపై పాకిస్థాన్ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చుట్టుపక్కల ఉన్న వాళ్లు కూడా సీమా భర్తను వదిలేసి రావడాన్ని తప్పుబట్టారు. ఇక సీమా భర్త గులాం హైదర్ మొదట ఆమెను పాకిస్థాన్ కు వచ్చేయమని విజ్ఞప్తి చేసినా.. ఇప్పుడు మాత్రం ఆమె తనకు వద్దని అంటున్నాడు. అయితే తన పిల్లలు మాత్రం తనకు కావాల్సిందేనని కోరుతున్నాడు.
యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన.. గులాం హైదర్ తన మాజీ భార్య సీమా హైదర్ పై తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా.. ఆమె మానసికంగా అస్థిరంగా ఉందని ఆరోపించాడు. వీలైతే ఆమెను కటకటాల వెనక్కి నెట్టాలని కోరారు. సీమాను భారత్ లోనే ఉంచుకుని తన పిల్లలను పాకిస్థాన్‌కు పంపించాలని ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లకు విజ్ఞప్తి చేశారు. “ఆమె మంచి పాకిస్థానీ కాలేకపోయింది. ఆమె తన మతాన్ని, తన దేశాన్ని విడిచిపెట్టింది. అలాంటిది ఆమెను ఎలా నమ్మగలం. నాకు భారత్‌పై ఎలాంటి వ్యతిరేకత లేదు. నేను భారతదేశాన్ని గౌరవిస్తాను. కానీ నా పిల్లలను పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలు చేయమని బలవంతం చేయడం సరికాదు, ” అని గులాం హైదర్ అన్నాడు. సీమా తరపున వాదిస్తున్న న్యాయవాదిపై కూడా విమర్శలు చేశాడు గులాం హైదర్. రెండు దేశాల మధ్య గొడవ పెట్టడానికి లాయర్ ప్రయత్నిస్తున్నాడని ఆరోపించాడు. “ఏపీ సింగ్ చేస్తున్న పనులు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. హిందువులు, ముస్లింల మధ్య గొడవలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని" అన్నాడు గులాం.
Next Story