Mon Dec 23 2024 15:51:42 GMT+0000 (Coordinated Universal Time)
బూస్టర్ డోస్ ధరను భారీగా తగ్గించిన సీరం సంస్థ
బూస్టర్ డోసును కేవలం ప్రైవేటు ఆస్పత్రుల్లోనే ఇవ్వనున్నారు. 60 ఏళ్లకు పైబడినవారికి కేంద్రమే ఉచితంగా బూస్టర్ డోసు ఇస్తోంది.
న్యూ ఢిల్లీ : దేశంలో 18 ఏళ్లు దాటిన వారందరికీ బూస్టర్ (ప్రికాషన్) డోసు ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. రేపట్నుంచే ఈ ప్రక్రియ మొదలు కానుంది. బూస్టర్ డోసు కోసం కోవిన్ యాప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. తొలి రెండు డోసులు ఏ కంపెనీకి చెందిన వ్యాక్సిన్ తీసుకున్నారో.. బూస్టర్ డోసు కూడా అదే తీసుకోవాలని తెలిపింది.
కాగా.. బూస్టర్ డోసును కేవలం ప్రైవేటు ఆస్పత్రుల్లోనే ఇవ్వనున్నారు. 60 ఏళ్లకు పైబడినవారికి కేంద్రమే ఉచితంగా బూస్టర్ డోసు ఇస్తోంది. మిగతా వారంతా దీనికోసం కొంత ఖర్చు చేయకతప్పదు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీదారు సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) ఒక బూస్టర్ డోసు ధర రూ.600 అని నిన్న ప్రకటించింది. బూస్టర్ డోసు ధర మరీ ఎక్కువగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవ్వడంతో.. సంస్థ అధినేత అదార్ పూనావాలా మరోసారి పునః సమీక్షించి.. ప్రైవేటు ఆసుపత్రులకు అందించే కొవిషీల్డ్ బూస్టర్ డోసు ధరలను సవరించామని వెల్లడించారు. ఒక డోసు ధర రూ.600 నుంచి రూ.225కి తగ్గించామని తెలిపారు.
Next Story