Fri Dec 20 2024 19:35:56 GMT+0000 (Coordinated Universal Time)
Advani : అద్వానీకి భారతరత్న అందించిన రాష్ట్రపతి
బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీకి భారత రత్న అవార్డును ప్రదానం చేశారు
బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీకి భారత రత్న అవార్డును ప్రదానం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రదాని నరేంద్ర మోదీ ఆయన ఇంటికి వెళ్లి మరీ భారతరత్న అవార్డును అందించారు. అద్వానీ ఆరోగ్యం బాగా లేకపోవడంతో నేరుగా ఆయన ఇంటికి వెళ్లి భారతరత్నను ఆయనకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా భారతదేశానికి అద్వానీ చేసిన సేవలను పలువురు ప్రశంసించారు.
ఐదుగురికి ఇటీవల...
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఐదుగురికి భారతరత్న అవార్డు ను ప్రకటించిన సంగతి తెలిసిందే. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదురి చరణ్ సింగ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్, వ్యవసాయశాస్త్రవేత్త ఎస్. స్వామినాధన్ లకు ప్రకటించారు. ఆ నలుగురు మరణించిన తర్వాత భారతరత్న రావడంతో వారి కుటుంబ సభ్యులకు ద్రౌపది ముర్ము అందచేశారు. ఈరోజు అద్వానీ ఇంటికి వెళ్లి ఆమె ప్రధానితో కలసి ఆమె అద్వానీకి భారతరత్న పురస్కారాన్ని అందచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
Next Story