Tue Dec 24 2024 17:33:12 GMT+0000 (Coordinated Universal Time)
సోనియానే అధ్యక్షురాలిగా కొనసాగాలి
సోనియాను అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని తాము ఎప్పుడూ కోరలేదని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తెలిపారు.
సోనియాను అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని తాము ఎప్పుడూ కోరలేదని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తెలిపారు. సోనియా గాంధీని ఆయన కొద్దిసేపటి క్రితం కలిశారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకే సీనియర్ నేతలందరం సమావేశమయ్యామని చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నిరాశ పర్చాయని తెలిపారు. వచ్చే ఎన్నికల కోసం కార్యాచరణ సిద్ధం చేయాలని మాత్రమే కోరామని చెప్పారు.
హైకమాండ్ కు వ్యతిరేకం కాదు....
జీ 23 నేతలు కాంగ్రెస్ హైకమాండ్ కు వ్యతిరేకం కాదని చెప్పారు. తాము దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకుని ఉన్నామని, పార్టీయే తమకు పదవులను కట్టబెట్టిందని గులాం నబీ ఆజాద్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకూ అంతా సమిష్టిగా కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. సోనియా గాంధీయే పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు.
Next Story