Sun Dec 22 2024 21:38:35 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఆజాద్ కొత్త పార్టీ
కాంగ్రెస్ కు రాజీనామా చేసిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ నేడు కొత్త పార్టీని ప్రకటించ బోతున్నారు
కాంగ్రెస్ కు రాజీనామా చేసిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ నేడు కొత్త పార్టీని ప్రకటించ బోతున్నారు. జమ్మూకాశ్మీర్ లో నేడు కొత్త పార్టీని ప్రకటించనున్నారు. జమ్ము కాశ్మీర్ విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీ గా బయలుదేరి సైనిక్ కాలనీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడనున్నారు. జమ్మూ కాశ్మీర్ లో జరగనున్న ఎన్నికల్లో ఆయన సొంతంగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే కొందరు నేతలు....
ఇప్పటికే కాంగ్రెస్ కు పార్టీకి రాజీనామా చేసిన గులాం నబీ ఆజాద్ కు మద్దతుగా కాంగ్రెస్ లోని అత్యధిక శాతం మంది జమ్మూకాశ్మీర్ నేతలు కూడా రాజీనామా చేశారు. వీరిలో ఉప ముఖ్యమంత్రి, మాజీ మంత్రులు కూడా ఉన్నారు. వీరంతా ఆజాద్ కు మద్దతుగా నిలవనున్నారు. ఈరోజు మరికొందరు ఆజాద్ కు మద్దతుగా నిలవనున్నారు. జమ్మూ కాశ్మీర్ లో కొత్త పార్టీ ద్వారా గులాం నబీ ఆజాద్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గతంలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి గా పనిచేసిన ఆజాద్ సొంత రాష్ట్రంలోనే తన రాజకీయ జీవితంలో మార్పులు తెచ్చుకోవాలని భావిస్తున్నారు.
Next Story