Mon Dec 23 2024 04:41:03 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్ అగ్రనేతల సమావేశం.. మరోసారి సోనియాకు?
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ హైకమాండ్ పై సీనియర్ నేతలు మరింత ఒత్తిడి పెంచనున్నారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ హైకమాండ్ పై సీనియర్ నేతలు మరింత ఒత్తిడి పెంచనున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి మరో లేఖ రాసే అవకాశముంది. సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ నివాసంలో సమావేశమైన నేతలు దేశంలో పార్టీ పరిస్థితులను చర్చించారు. ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీ దేశం నుంచి కనుమరుగు కావడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమమయింది.
లేఖ రాయాలని....
ీతాము మొత్తుకుంటున్నా పార్టీకి శాశ్వత అధ్యక్షుడిని నియమించలేదని వారు అంటున్నారు. అధికారంలో ఉన్న పంజాబ్ ను కోల్పోవడంతో పాటు నాలుగు రాష్ట్రాల్లో సరైన ఫలితాలు సాధించకపోవడంపై సీనియర్ నేతలు చర్చించారు. త్వరలోనే సోనియాకు దీనిపై లేఖ రాయాలని నిర్ణయించారు. ఈ భేటీలో గులాం నబీ ఆజాద్ తో పాటు కపిల్ సిబాల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ తదితరులు హాజరయ్యారు.
Next Story