Mon Dec 23 2024 03:12:36 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : కోల్కత్తా హత్యాచారం కేసులో విస్తుబోయే నిజాలు
కోల్కత్తాలో జరిగిన అభయ హత్యాచార ఘటనపై సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి
కోల్కత్తాలో జరిగిన అభయ హత్యాచార ఘటనపై సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పోస్టు మార్టం నివేదికలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. అభయ కొన ఊపిరితో ఉన్నప్పుడు అత్యాచారం జరిగిందని పోస్టుమార్టం నివేదికలో వెల్లడయింది. అభయ గొంతు నలుమడం వల్లనే చనిపోయందని పోస్టుమార్టం నివేదికలో వైద్యులు పేర్కొన్నారు.
ఇరవై నాలుగు చోట్ల...
అభయ శరీరంపై 24 చోట్ల గాయాలున్నట్లు తేలింది. గొంత వద్ద ఎముకలు కూడా విరిగినట్లు కూడా కనుగొన్నారు. అయితే అభయకు మత్తు మందు ఇచ్చారా? లేదా? అన్న విషయం ఫోరెన్సిక్ నివేదిక తర్వాతనే తేలనుంది. శరీరంపై పలు చోట్ల గీతలు, గాట్లు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుండటంతో మరిన్ని కీలక విషయాలు వెలుగు చూసే అవకాశముంది.
Next Story