Mon Dec 23 2024 16:42:38 GMT+0000 (Coordinated Universal Time)
నేటి పంచాంగం, రాశి ఫలాలు.. ఈరోజు ఏ రాశి వారికి ఎలా ఉందో చూడండి !
మీ రాశిఫలం ఎలా ఉంది ? ఏ పనులు చేయొచ్చు, ఏయే పనులు చేయకూడదు ? ఏ రంగు దుస్తులు ధరించకూడదు ?
ఉదయం లేవగానే.. ఈరోజు ఎలా ఉంటుందో ? ఏ పని చేస్తే ఎలా కలిసొస్తుందో ? అని చాలా మంది ఆలోచిస్తారు. కొత్తగా ఏ పని చేయాలన్నా మంచి, చెడులను చూస్తారు. మరి ఈ రోజు అనగా సెప్టెంబర్ 30, శుక్రవారం మీ రాశిఫలం ఎలా ఉంది ? ఏ పనులు చేయొచ్చు, ఏయే పనులు చేయకూడదు ? ఏ రంగు దుస్తులు ధరించకూడదు ? అన్న విషయాలను ఇక్కడ తెలుసుకోండి.
నేటి పంచాంగం :
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీయుజ మాసం
తిథి : శు.పంచమి రా.10.34 వరకు
నక్షత్రం : అనూరాధ తె.4.19 వరకు
వర్జ్యం : ఉ.9.04 నుండి 10.36 వరకు
దుర్ముహూర్తం : ఉ.8.23 నుండి 9.11 వరకు తదుపరి
రా.12.21 నుండి 1.09 వరకు
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : మ.3.00 నుండి 4.30 వరకు
శుభ సమయాలు : ఉ.7.45 నుండి 8.05 వరకు
సా.5.15 నుండి 6.00 వరకు
మేషరాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు నేడు మధ్యస్తంగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండటం మంచిది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. క్రయ విక్రయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. భూమి, వాహన రిజిస్ట్రేషన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు, వ్యాపారస్తులు తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన పనులు చేసుకోవాలి. నేడు ధరించకూడని రంగు నలుపు రంగు.
వృషభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు నేడు సానుకూల ఫలితాలుంటాయి. నూతన ఉద్యోగాల కోసం, బెటర్ జాబ్స్ కోసం ప్రయత్నించేవారికి అనుకూలంగా ఉంది. అలాగే విదేశీ ప్రయాణాలకు కూడా నేడు సానుకూలంగా ఉంది. ఇంట, బయట గౌరవం పెరుగుతుంది. నేడు ధరించకూడని రంగు గులాబీ రంగు.
మిథున రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు నేడు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. పెట్టుబడులపై దృష్టిసారిస్తారు. కొత్తపరిచయాలు జరుగుతాయి. నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేయొచ్చు. ఖర్చులు అధికంగా ఉంటాయి. నేడు ధరించకూడని రంగు కాఫీ రంగు.
కర్కాటకం
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు నేడు ఇంట, బయట కూడా మనోవేదన ఎక్కువగా ఉండే సంకేతాలున్నాయి. చిన్న ఉద్యోగం లేదా పని దొరికినా దానిని చేయడం మంచిది. ఈ రాశివారికి నేడు ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. నేడు ధరించకూడని రంగు తెలుపు రంగు.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు నేడు పనులు వాయిదా పడుతుంటాయి. క్రయ, విక్రయాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. మధ్యవర్తుల కారణంగా నష్టాలు వాటిల్లే అవకాశం ఉంది. ఆర్థికంగా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. నేడు ధరించకూడని రంగు ఆరెంజ్.
కన్యారాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు నేడు సానుకూలమైన ఫలితాలుంటాయి. విద్యార్థులకు అనుకూలం. క్రయ విక్రయాలు కలిసి వస్తాయి. నూతన వాహన లేదా స్థల కొనుగోళ్లకు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. డబ్బు అప్పు ఇచ్చే ముందు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. నేడు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు.
తులా రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు నేడు ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిళ్లు ఎక్కువగా ఉండొచ్చు. ఏ విషయంలోనైనా మీ తప్పు లేకుండా మాట పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రయ, విక్రయాల్లో నష్టాలు రావొచ్చు. నేడు ధరించకూడని రంగు బూడిదరంగు.
వృశ్చిక రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు నేడు మధ్యస్త ఫలితాలు ఉండొచ్చు. ఇంటర్వ్యూలు ఫలిస్తాయి. చాలాకాలంగా ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి బయటపడే సంకేతాలున్నాయి. భార్య, భర్తల మధ్య చిన్న చిన్న గొడవలుంటాయి. నేడు ధరించకూడని రంగు నీలం రంగు.
ధనస్సు రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు నేడు వృధా ఖర్చులు తప్పకపోవచ్చు. మాట పట్టింపులు పెరుగుతాయి. అనుకోని ప్రయాణాలు ఎదురవుతాయి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. నిద్రాహారాలు లోపిస్తాయి. నేడు ధరించకూడని రంగు పసుపు రంగు.
మకర రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు నేడు క్రయ విక్రయాలకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. గౌరవం పెరుగుతుంది. నేడు ధరించకూడని రంగు వంకాయ రంగు.
కుంభ రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు నేడు సాధారణ ఫలితాలుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిళ్లు తప్పవు. శారీరకంగా అలసట ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మంచిది. నేడు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు.
మీన రాశి
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు నేడు అంచనాలు తారుమారవుతాయి. తప్పనిసరిగా చేయాల్సిన పనులు మినహా మిగతా వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. నిద్రాహారాల లోపం ఉంటుంది. పాత విషయాలను గుర్తుచేసుకుంటారు. నేడు ధరించకూడని రంగు ఎరుపు రంగు.
Next Story