Mon Dec 23 2024 05:15:28 GMT+0000 (Coordinated Universal Time)
Parliament : ఒకే రోజు 78 మంది సభ్యుల సస్పెన్షన్ ... సమావేశాలు ముగిసే వరకూ
పార్లమెంటులో ఒక్కరోజే 78 సభ్యులను సస్పెండ్ చేశారు. శీతాకాల సమావేశాలు మొత్తానికి హాజరుకాకుండా సస్పెండ్ వేటు వేశారు.
పార్లమెంటులో ఒక్కరోజే 78 సభ్యులను సస్పెండ్ చేశారు. ఉభయ సభల నుంచి మొత్తం 92 మంది వరకూ సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు. విపక్ష సభ్యులందరినీ అధికారపక్షం సస్పెండ్ చేసిందనే చెప్పాలి. గత శుక్రవారం 14 మంది ఎంపీలను సస్పెండ్ చేసింది. ఈరోజు 78 మంది సభ్యులను సస్పెండ్ చేస్తూ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకున్నారు. వీళ్లంతా శీతాకాల సమావేశాలు మొత్తానికి హాజరుకాకుండా సస్పెండ్ వేటు వేశారు.
విపక్షం లేకుండానే...
అంటే శీతాకాల సమావేశాలు ప్రతిపక్షాలు లేకుండానే సమావేశాలు జరుగుతాయన్న మాట. అయితే ఇటీవల పార్లమెంటులో జరిగిన దాడిపై చర్చ జరగాలంటూ గత కొద్ది రోజులుగా విపక్ష నేతలు పట్టుబడుతున్నారు. హోంమంత్రి దీనిపై సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నార. పార్లమెంటులో భద్రతపై చర్చ జరగాలంటూ పట్టుబడుతుండటంతో స్పీకర్ ఓం బిర్లా అధిక సంఖ్యలో సభ్యులను సప్పెండ్ చేశారు.
Next Story