Tue Nov 19 2024 08:30:31 GMT+0000 (Coordinated Universal Time)
నా భార్య స్త్రీ కాదు.. విడాకులు ఇప్పించండి : సుప్రీంను ఆశ్రయించిన వ్యక్తి
వైద్య పరీక్షలు చేయించగా.. భార్యకు ఇంపెర్ఫోరేట్ హైమెన్ అనే సమస్య పుట్టుకతో ఉన్నట్లు తేలింది. దాంతో తనను భార్య పుట్టింటి వారు..
గ్వాలియర్ : తన భార్య స్త్రీ కాదని, అత్తింటివారు ఆ విషయాన్ని దాచి తనకు ఆమెనిచ్చి పెళ్లి చేశారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ బాధితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. స్త్రీ కాని తన భార్యతో విడాకులు ఇప్పించాలని వేడుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ పట్టణానికి చెందిన వ్యక్తికి 2016లో పెళ్లైంది. పెళ్లైన కొన్నాళ్ల వరకూ భార్య లైంగిక జీవనానికి సహకరించలేదు. ఆ తర్వాత భర్త బలవంతం మీద ఒప్పుకున్న ఆమెకు.. తెరచుకోని స్త్రీ జననేంద్రియంతో పాటు పురుష జననేంద్రియం కూడా ఉన్నట్లు అతను గుర్తించాడు.
వైద్య పరీక్షలు చేయించగా.. భార్యకు ఇంపెర్ఫోరేట్ హైమెన్ అనే సమస్య పుట్టుకతో ఉన్నట్లు తేలింది. దాంతో తనను భార్య పుట్టింటి వారు మోసం చేశారని గ్రహించి, వారిని నిలదీశాడు. ఈ విషయంపై ఇరువర్గాలు పోలీస్ కేసులు పెట్టుకున్నాయి. ఆమెకు శస్త్రచికిత్స చేయడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు కానీ.. పిల్లలు పుట్టే అవకాశాలు మాత్రం లేవని వైద్యులు స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ హైకోర్టు పిటిషన్ ను తోసిపుచ్చడంతో అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. బాధితుడి పిటిషన్ ను పరిశీలించిన సుప్రీంకోర్టు.. దీనిపై తన స్పందనేంటో తెలియజేయాలని కోరుతూ ఆ మహిళకు నోటీసులు జారీ చేసింది.
Next Story