Fri Apr 11 2025 21:30:46 GMT+0000 (Coordinated Universal Time)
ఏక్ నాథ్ షిండేకు షాకిచ్చిన ఉద్ధవ్ ఠాక్రే
బీజేపీ మద్దతుతో మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఏక్నాథ్ షిండేను పార్టీ అన్ని పదవుల నుంచి శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే శుక్రవారం తొలగించారు.

బీజేపీ మద్దతుతో మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఏక్నాథ్ షిండేను పార్టీ అన్ని పదవుల నుంచి శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే శుక్రవారం తొలగించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు షిండేను తొలగించినట్లు శివసేన ఒక ప్రకటనలో తెలిపింది. పార్టీ సభ్యత్వాన్ని కూడా వదులుకున్నందున షిండేపై చర్యలు తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే ప్రమాణస్వీకారం చేయగా.. 24 గంటల తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ అగ్రనాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణం చేశారు.
శివసేనలో తిరుగుబాటుకు నాయకత్వం వహించిన షిండే కొత్త ముఖ్యమంత్రి అవుతారని, కొత్త ప్రభుత్వం నుండి తాను తప్పుకుంటానని దేవేంద్ర ఫడ్నవిస్ చెప్పుకొచ్చారు. తన పార్టీ కేంద్ర నాయకత్వం నుండి ప్రోద్బలంతో తాను డిప్యూటీ సీఎం అవుతానని ఫడ్నవీస్ సాయంత్రం ప్రకటించారు.
దక్షిణ ముంబైలోని రాజ్భవన్లో గవర్నర్ భగత్సింగ్ కోష్యారీ షిండేతో పాటు ఆయన డిప్యూటీ ఫడ్నవీస్తో ప్రమాణం చేయించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన షిండే, థానే జిల్లాలో తన రాజకీయ గురువు, దివంగత శివసేన నాయకులు బాల్ థాకరే, ఆనంద్ డిఘేలకు నివాళులర్పించడం ద్వారా ప్రమాణ స్వీకారం చేయడం ప్రారంభించారు. కొత్త ప్రభుత్వం తమ మెజారిటీని నిరూపించుకునేందుకు జూలై 2 నుంచి మహారాష్ట్ర శాసనసభ రెండు రోజుల ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనుంది.
News Summary - Shiv Sena chief Uddhav Thackeray sacks Eknath Shinde from all party posts
Next Story