Fri Nov 08 2024 09:47:45 GMT+0000 (Coordinated Universal Time)
మరోసారి సుప్రీంకోర్టుకు శివసేన
షిండేతో పాటు మరో పదిహేనుమంది ఎమ్మెల్యేల అనర్హత అంశం తేలేవరకూ సస్పెండ్ లో ఉంచాలని సుప్రీంకోర్టును శివసేన ఆశ్రయించింది.
మరోసారి శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో పాటు మరో పదిహేనుమంది ఎమ్మెల్యేల అనర్హత అంశం తేలేవరకూ సస్పెండ్ లో ఉంచాలని సుప్రీంకోర్టును శివసేన ఆశ్రయించింది. అయితే శివసేన పిటీషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ నెల 11వ తేదీన ఎటూ విచారణ ఉండటంతో దీనిపై ఇప్పుడు విచారించడం తగదని సూచించింది.
అనర్హత పిటీషన్ పై....
మహారాష్ట్రలో డిప్యూటీ స్పీకర్ మొత్తం 16 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈలోగా ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా రాజీనామా చేయడం, షిండే ప్రమాణస్వీకారం చేయడం జరిగిపోయాయి. కానీ శివసేన మాత్రం అనర్హతపై నేడు మరోసారి సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. ఈ నెల 11వ తేదీన విచారణకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
Next Story