Sun Dec 22 2024 22:33:55 GMT+0000 (Coordinated Universal Time)
మధ్యప్రదేశ్లో బీజేపీ భారీ విజయం ఖాయమే
ఎగ్జిట్ పోల్స్ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో గట్టి పోటీని అంచనా వేసినప్పటికీ.. భారతీయ జనతా పార్టీ
ఎగ్జిట్ పోల్స్ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో గట్టి పోటీని అంచనా వేసినప్పటికీ.. భారతీయ జనతా పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకోడానికి సిద్ధంగా ఉంది. 2003 నుండి అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దింపడానికి ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రయత్నాలు చేసింది. ఉదయం 11.25 గంటలకు బీజేపీ 155 స్థానాల్లో ముందంజలో ఉంది - ప్రతిపక్ష కాంగ్రెస్ కు 72 స్థానాల్లో ఆధిక్యత ఉంది. ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ బుధ్ని నుండి ముందంజలో ఉన్నారు.
భారతీయ జనతా పార్టీ పూర్తి మెజారిటీతో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ ఆదివారం ఉదయమే తెలిపారు. ఆయన చెప్పినట్లుగానే బీజేపీ లీడ్ లో దూసుకుపోతోంది. మధ్యప్రదేశ్ బీజేపీ ఆఫీసులో సంబరాలు అంబరాన్ని అంటాయి. వేడుకలకు వందల మిఠాయిల ప్యాకెట్లు శివరాజ్ సింగ్ నివాసానికి చేరుకున్నాయి. కేంద్రమంత్రి, పార్టీ నేత జ్యోతిరాదిత్య సింధియా కూడా ఆదివారం నాడు ముఖ్యమంత్రి నివాసానికి వచ్చారు.
Next Story