Sun Dec 22 2024 06:44:29 GMT+0000 (Coordinated Universal Time)
షాకింగ్ యాక్సిడెంట్.. నెట్టింట వైరల్
పశ్చిమ బెంగాల్లోని కూచ్ బెహార్లో షాకింగ్ యాక్సిడెంట్ చోటు చేసుకుంది
పశ్చిమ బెంగాల్లోని కూచ్ బెహార్లో షాకింగ్ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ఆలస్యంగా ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ బయటకు రావడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతి వేగంతో వచ్చిన బైకు బొలేరో వాహనాన్ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే ముగ్గురు చనిపోయిన ఘటన పశ్చిమ బెంగాల్ లో జరిగింది.
అతి వేగంతో...
బైకుపై ఊహకందని వేగంతో ఓ రైడర్ రోడ్డు దాటుతున్న బొలెరోను ఢీకొట్టాడు. ఆ మెరుపు వేగం ధాటికి బైక్ ఒక్కసారిగా పేలిపోయి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బైకర్ తో పాటు బొలెరోలోని ఇద్దరు ప్రాణాలు వదిలినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 11వ తేదీన జరిగిన ఈ యాక్సిడెంట్ షాకింగ్ విజువల్స్ తాజాగా బయటకు వచ్చాయి. దీంతో ఇవి నెట్టింట వైరల్ గా మారాయి.
Next Story