Mon Dec 23 2024 04:02:11 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్‌గా డీకే శివకుమార్ కూడా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కంఠీరవ స్టేడియంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండనుంది. వీరితో పాటు ఎనిమిది మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ముఖ్య అతిధులుగా...
ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొననున్నారు. విపక్షాల నేతలను కూడా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. వేలాది మంది అభిమానుల మధ్య ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. గవర్నర్ వీరి చేతి ప్రమాణ స్వీకార చేయించనున్నారు.
- Tags
- siddaramaiah
- oath
Next Story