Wed Apr 09 2025 23:59:21 GMT+0000 (Coordinated Universal Time)
భారీ వర్షాలు.. వరదలతో అతలాకుతలం
సిక్కిం వరదలతో అల్లాడి పోతుంది. భారీ వర్షాలతో వరదలు సంభవించాయి.

సిక్కిం వరదలతో అల్లాడి పోతుంది. భారీ వర్షాలతో వరదలు సంభవించాయి. దీంతో సిక్కిం వరదలతో మునిగిపోయింది భారీ వర్షాల కారణంగా ఎక్కడికక్కడ వాగులు వంకలు ఉప్పొంగి ఉత్తర సిక్కిం ప్రాంతంలో వదరలు సంభవిస్తున్నాయి. తీస్తా నది ఉప్పొంగడంతో భారీ వరదలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అనేక వాహనాలు నీట మునిగాయి. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాలేక ఇబ్బందులు పడుతున్నారు.
23 మంది గల్లంతు...
అయితే ఒక్కసారిగా సంభవించిన వరదలతో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతయినట్లు అధికారులు వెల్లడించారు. రక్షణ శాఖ వెల్లడించిన అధికారిక సమాచారం ప్రకారం ఆర్మీ సిబ్బంది ఈ వరదలలో ప్రాణాలు కోల్పోయారని చెబుతున్నారు. అయితే గల్లంతయిన ఆర్మీ సిబ్బంది కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
Next Story