Mon Dec 23 2024 02:50:54 GMT+0000 (Coordinated Universal Time)
Sitaram Yechury సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని ఎవరికి దానం చేశారంటే?
ఆయన భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. సీతారాం ఏచూరిని ఆగస్టు 19న ఎయిమ్స్‌లోని ఎమర్జెన్సీ వార్డులో చేర్చారు. ఆ తర్వాత ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)కి తరలించారు. ఆయన న్యుమోనియా ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారని సీపీఎం నేతలు తెలిపారు. ఏచూరి కంటిశుక్లం శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం దెబ్బతింది. తుదిశ్వాస విడిచారు.
ఆయన భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు ఎయిమ్స్ కు దానం చేశారు. వైద్య విద్యను అభ్యసించే విద్యార్థుల బోధన, రీసెర్చ్ లో ఏచూరి భౌతికకాయాన్ని ఉపయోగించుకోవాలని కుటుంబ సభ్యులు ఎయిమ్స్ ను కోరారని ఢిల్లీ ఎయిమ్స్ ఓ ప్రకటనలో తెలిపింది. 'టీచింగ్, రీసెర్చ్ ప్రయోజనాల కోసం ఆయన కుటుంబం ఏచూరి శరీరాన్ని న్యూ ఢిల్లీలోని AIIMSకి దానం చేసింది" అని AIIMS ఒక ప్రకటనలో తెలిపింది.
Next Story