Tue Nov 12 2024 19:59:19 GMT+0000 (Coordinated Universal Time)
నాగాలాండ్ లో ఘోరం.. భద్రతాదళాల చేతుల్లో గ్రామస్థుల మృతి
ఉగ్రవాదులుగా భావించి భద్రతాదళాలు కాల్పులు జరపడంతో ఆరుగురు మృతి చెందిన సంఘటన నాగాలాండ్ లో జరిగింది
ఉగ్రవాదులుగా భావించి భద్రతాదళాలు కాల్పులు జరపడంతో ఆరుగురు మృతి చెందిన సంఘటన నాగాలాండ్ లో జరిగింది. ఈ సంఘటనలో గ్రామస్థులు మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. భద్రతాదళాల కాల్పులపై ఆగ్రహించిన గ్రామస్థులు వారి వాహనాలకు నిప్పు పెట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది.
వాహనంపై వస్తుండగా...
నాగాలాండ్ లోని మోన్ జిల్లాలో తిరు గ్రామానికి చెందిన గ్రామస్థులు వాహనంపై వస్తున్నారు. వారిని ఉగ్రవాదులుగా భావించి భధ్రతాదళాలు కాల్పులు జరిపాయి. దీంతో అక్కడికక్కడే ఆరుగురు పౌరులు ప్రాణాలు కోల్పాయారు. నాగాలాండ్ లో ఉగ్రవాదుల దాడిలో జవాన్లు ప్రాణాలు కోల్పోవడంతో వారి కోసం గాలింపు జరుపుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. దీంతో గ్రామస్థులు ఆగ్రహం చెంది భద్రతాదళాలకు చెందిన వాహనాలకు నిప్పుపెట్టారు.
Next Story