Fri Dec 20 2024 11:57:29 GMT+0000 (Coordinated Universal Time)
రైలులో పొగలు.. నిలిపేసిన అధికారులు
ప్రయాణిస్తున్న రైలులో పొగలు కన్పించాయి. ముంబయి నుంచి భువనేశ్వర్ వెళుతున్న కోణార్క్ ఎక్స్ప్రెస్ లో ఈ సంఘటన జరిగింది.
వేగంగా ప్రయాణిస్తున్న రైలులో పొగలు కన్పించాయి. ముంబయి నుంచి భువనేశ్వర్ వెళుతున్న కోణార్క్ ఎక్స్ప్రెస్ లో ఈ సంఘటన జరిగింది. కోణార్క్ ఎక్క్ప్రెస్ ఏసీ బోగీల్లో పొగలు రావడంతో అది గమనించిన అధికారులు దానిని డోర్నకల్ రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు. వెంటనే పొగలు వస్తున్న బోగీని అధికారులు పరిశీలించారు.
సురక్షితంగా ప్రయాణికులు....
ఆ బోగీని తీసి వేసి అందులో ఉన్న ప్రయాణికులను వేరే బోగీలోకి తరలించారు. అయితే పొగలు రావడం గమనించడంతో వెంటనే రైలును నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని రైల్వే అధికారులు తెలిపారు. దీనిపై రైల్వే శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు. కోణార్క్ ఎక్స్ప్రెస్ తిరిగి డోర్నకల్ స్టేషన్ నుంచి బయలు దేరి వెళ్లింది.
Next Story