Sun Dec 22 2024 20:16:47 GMT+0000 (Coordinated Universal Time)
మధ్యాహ్న భోజనంలో పాము.. 30 మంది విద్యార్థులకు అస్వస్థత
విద్యార్థులకు వడ్డించే భోజనంలో పాము కనిపించడంతో సిబ్బంది షాకయ్యారు. అప్పటికే ఆ భోజనాన్ని తిన్న 30 మంది విద్యార్థులు..
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు.. ప్రభుత్వం తరపున అందించే మధ్యాహ్న భోజనంలో పాము కనిపించింది. విద్యార్థులకు వడ్డించే భోజనంలో పాము కనిపించడంతో సిబ్బంది షాకయ్యారు. అప్పటికే ఆ భోజనాన్ని తిన్న 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బీర్భూమ్ జిల్లా మయూరేశ్వర్ బ్లాక్ లో ఉన్న ఓ పాఠశాలలో చోటుచేసుకుంది. సోమవారం (జనవరి 9) మధ్యాహ్నం సిబ్బంది యదావిధిగా విద్యార్థులకు భోజనం వడ్డించారు.
ఆ ఆహారాన్ని తిన్న విద్యార్థులు ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు. ఏమైందోనని విద్యార్థులకు భోజనం వడ్డించిన పాత్రలను చూడగా.. పప్పు వండిన పాత్రలో పాము కనిపించిందని సిబ్బంది తెలిపారు. తమ పిల్లలు అస్వస్థతకు గురయ్యారంటూ విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఫిర్యాదులు వచ్చాయని బ్లాక్ డెవలప్ మెంట్ అధికారి దీపాంజన్ జానా వెల్లడించారు. వాంతులు చేసుకుని అస్వస్థతకు గురైన పిల్లల్ని రామ్ పూర్ హట్ మెడికల్ కాలేజీకి తరలించగా.. వారంతా చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారని పేర్కొన్నారు. ఒక విద్యార్థి మాత్రం చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.
Next Story