Wed Jan 01 2025 05:20:02 GMT+0000 (Coordinated Universal Time)
కేజ్రీవాల్ కు అన్నాహజారే లేఖ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే విమర్శలు చేశారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన బహిరంగం లేఖ రాశారు. కేజ్రీవాల్ అధికార మత్తులో మునిగిపోయారని అన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని చూస్తే మద్యం అమ్మకాలను పెంచడంతో పాటు అవినీతిని ప్రోత్సహించినట్లవుతుందని ఆయన దుయ్యబట్టారు.
అవినీతిని అంతం చేస్తానంటూ...
అవినీతిని అంతం చేస్తానంటూ అధికారంలోకి వచ్చి మద్యం అమ్మకల్లో అవినీతిని ఎందుకు ప్రోత్సహించారంటూ మండి పడ్డారు. ప్రజల జీవితాలను నాశనం చేసే విధంగా నిర్ణయాలు ఉన్నాయన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై వార్తలను చదువతుంటే తనకు బాధగా ఉందని అన్నా హజారే లేఖలో ప్రస్తావించారు. అందుకే తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి కేజ్రీవాల్ కు లేఖ రాశానని ఆయన చెప్పుకొచ్చారు.
Next Story