Sun Mar 23 2025 15:49:56 GMT+0000 (Coordinated Universal Time)
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. లక్షల రూపాయల బోనస్
చెన్నైలోని ఒక సాఫ్ట్ వేర్ సంస్థ తమ ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది. ఏకంగా యాభైశాతం బోనస్ ఇస్తున్నట్లు తెలిపింది.

సాఫ్ట్ వేర్ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కంపెనీలు ప్రతి ఏడాది బోనస్ లు ప్రకటిస్తుంటాయి. అయితే ఈ మధ్యకాలంలో బోనస్ లు అనేవి కన్పించడం లేదు. వేతనం కొద్దిగా పెంచి సాఫ్ట్ వేర్ కంపెనీలు మ.. మ అనిపించేస్తున్నాయి. కానీ కార్పొరేట్ సంస్థలకు భిన్నంగా చెన్నైలోని ఒక సాఫ్ట్ వేర్ సంస్థ తమ ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది. ఏకంగా యాభైశాతం బోనస్ ఇస్తున్నట్లు తెలిపింది.
యూకేకు చెందిన...
యూకేకు చెందిన ఎస్ఏఎఎస్ కంపెనీ తన 140 మంది ఉద్యోగులకు 14.5 కోట్ల రూపాయలను బోనస్ గా చెల్లించింది. అయితే 2022 డిసెంబరు 31వ తేదీకి ముందు చేరిన ఉద్యోగులకు మాత్రమే ఈ బోనస్ ను ఇచ్చింది. వార్షిక వేతంపై యాభై శాతం బోనస్ ఇవ్వడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ సంస్థ పురోగతికి పాటుపడిన వారికి ఈ బోనస్ అందచేసినట్లు సీఈవో శ్రావణ్ కుమార్ తెలిపారు. పనితీరు మరింత మెరుగుపర్చుకని కంపెనీని మరింత లాభాల బాటలో ఉండేలా పనిచేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.
Next Story