Fri Nov 22 2024 22:47:04 GMT+0000 (Coordinated Universal Time)
వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తోన్న మరో సాఫ్ట్ వేర్ దిగ్గజం SAP
కోర్ బిజినెస్ ఏరియాను బలోపేతం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఎస్ఏపీ తీసుకున్న ఈ నిర్ణయంతో కంపెనీలో..
ప్రపంచం ఆర్థికమాంద్యం దిశగా అడుగులేస్తోంది. కరోనా తర్వాత చాలా దేశాల్లో పరిస్థితులు తలకిందులయ్యాయి. ఇప్పటికీ కరోనా ముందునాటి పరిస్థితుల్లేవు. శ్రీలంక, పాకిస్థాన్ లలో ఆర్థికమాంద్యం కొనసాగుతోంది. మిగతా దేశాల్లోనూ ఆర్థికమాంద్యం ముంచుకొస్తున్న నేపథ్యంలో.. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలు జీతాలు చెల్లించలేమన్న పేరుతో వేలాదిమంది ఉద్యోగుల్ని తొలగించాయి. ఇప్పటికే ట్విట్టర్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్ సహా.. జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ సంస్థలూ ఉద్యోగుల్ని తొలగించాయి.
అంతర్జాతీయ మీడియాలోనూ ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి. తాజాగా ఈ జాబితాలోకి జర్మన్ సాఫ్ట్ వేర్ దిగ్గజం ఎస్ఏపీ(SAP) కూడా చేరింది. ఈ ఏడాది 3 వేల వరకు ఉద్యోగులను తొలగించనున్నట్లు సంస్థ ప్రకటించింది. కోర్ బిజినెస్ ఏరియాను బలోపేతం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఎస్ఏపీ తీసుకున్న ఈ నిర్ణయంతో కంపెనీలో పనిచేస్తున్న 2.5 శాతం ఉద్యోగులపై ప్రభావం పడనుంది. ఎస్ఏపీలో ప్రపంచ వ్యాప్తంగా 1,20,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఉద్యోగుల లే ఆఫ్ లతో విదేశాల్లో ఉన్న భారత ఉద్యోగుల ఆందోళన చెందుతున్నారు. ఉన్నత చదువులు చదివి, ఉద్యోగాలతో విదేశాల్లో సెటిల్ అయిన నేపథ్యంలో.. ఉద్యోగం పోతే ఏం చేయాలన్న ఆందోళన నెలకొంది.
Next Story