Fri Nov 22 2024 23:57:31 GMT+0000 (Coordinated Universal Time)
మనదేశంలో సూర్యగ్రహణం కనిపించే సమయాలు, నగరాలు ఇవే
సాయంత్రం 4.29 గంటల నుంచి 6.26 గంటల వరకూ సూర్యగ్రహణం ఉంటుంది. హైదరాబాద్ లో సాయంత్రం 4.59 గంటలకు ..
ఈ రోజు కేతుగ్రస్త పాచ్చిక సూర్యగ్రహణం ఏర్పడనుంది. మనదేశంలో ఈ గ్రహణాన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చూడగలం. పండితులు, శాస్త్రవేత్తలు ఈ గ్రహణాన్ని అరుదైన ఖగోళ విచిత్రంగా చెప్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. ఇలాంటి సూర్యగ్రహణం మళ్లీ భారత్ లో చూసే అవకాశం లేదు. మళ్లీ 2027 ఆగస్టు 2న మనదేశంలో సూర్యగ్రహణం కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రోజు ఏర్పడే గ్రహణం మనదేశంలో జైపూర్, నాగ్ పూర్, ద్వారక, చెన్నై, ముంబై, కోల్ కతా నగరాల్లో మాత్రమే 43 శాతం కనిపిస్తుంది.
సాయంత్రం 4.29 గంటల నుంచి 6.26 గంటల వరకూ సూర్యగ్రహణం ఉంటుంది. హైదరాబాద్ లో సాయంత్రం 4.59 గంటలకు గ్రహణం ప్రారంభమవుతుంది. ఢిల్లీలో సాయంత్రం 4.29, కోల్ కతాలో 4.52, చెన్నైలో 5.14, ముంబైలో 4.49, ద్వారకలో 4.36, తిరువనంతపురంలో 5.29, నాగ్ పూర్ లో 4.49 గంటలకు గ్రహణం ప్రారంభమవుతుంది. ఈ గ్రహణం తులారాశిలోని స్వాతి నక్షత్రంలో ఏర్పడుతుండటంతో.. ఆ రాశివారు గ్రహణాన్ని చూడకూడదని ఇప్పటికే పురోహితులు తెలిపారు. అలాగే వృశ్చిక, మీనరాశుల వారు కూడా గ్రహణాన్ని వీక్షించకపోవడం మంచిదని పేర్కొన్నారు.
Next Story