Sat Dec 21 2024 14:41:57 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై బాంబు దాడి
కేరళలో ఆర్ఎస్ఎస్ కార్యాలయంలపై గుర్తు తెలియని వ్యక్తులు కొందరు బాంబులు విసిరారు.
కేరళలో వరసగా పార్టీ కార్యాలయాలు, దాని అనుబంధ సంఘాల ఆఫీసులపై దాడులు జరుగుతున్నాయి. ఇటీవల రాహుల్ గాంధీ కార్యాలయంపై కొందరు యువకులు దాడి చేసి ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కేరళలో ఆర్ఎస్ఎస్ కార్యాలయంలపై గుర్తు తెలియని వ్యక్తులు కొందరు బాంబులు విసిరారు. కేరళ రాష్ట్రంలోని కన్నూరు జిల్లాలోని పయ్యనూర్ లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయం ఈ దాడి జరిగింది.
తప్పించుకున్న...
బాంబు దాడిలో ఆర్ఎస్ఎస్ కార్యాలయంలోని కిటికీలు, అద్దాలు, తలుపులు ధ్వంసమయ్యాయి. దాడి జరిగిన సమయంలో కార్యకర్తలు ఉన్నప్పటికీ వారంతా తప్పించుకున్నారని పోలీసులు చెబుతున్నారు. అయితే దాడి వెనక అధికార సీపీఎం హస్తం ఉందని ఆర్ఎస్ఎస్ చెబుతోంది. పయ్యనూర్ సీపీఎం నేత థన్రాజ్ వర్ధంతి నేపథ్యంలో ఈ దాడి జరిగిందని ఆర్ఎస్ఎస్ నేతలు అనుమానిస్తున్నారు.
Next Story