Mon Dec 23 2024 12:20:11 GMT+0000 (Coordinated Universal Time)
పంజాబ్ ఎన్నికల ఫలితాలు : సోనూసూద్ సోదరి ఓటమి
అంచనాలకు అందని రీతిలో అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుంటూ.. దూసుకుపోతోంది. మొత్తం 117 స్థానాలకు గానూ..
పంజాబ్ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయకేతనం ఎగురవేస్తోంది. అంచనాలకు అందని రీతిలో అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుంటూ.. దూసుకుపోతోంది. మొత్తం 117 స్థానాలకు గానూ.. ఆప్ 90 స్థానాలను గెలుచుకుంది. ఆప్ దెబ్బకు పంజాబ్ మాజీ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ కూడా ఓటమిని చవి చూడక తప్పలేదు. ఆయన రెండు స్థానాల నుంచి పోటీ చేయగా.. రెండు స్థానాల్లోనూ ఆప్ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు.
కాగా.. బాలీవుడ్ నటుడు సోనూసూద్ సోదరి మాళవిక కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ తరపున మోగా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె.. ఆప్ అభ్యర్థి డాక్టర్ అమన్ దీప్ కౌర్ అరోరా చేతిలో పరాజయం పొందారు. అమన్ దీప్ కు 58,813 ఓట్లు రాగా.. మాళవికకు 38,125 ఓట్లు వచ్చాయి.
Next Story