Mon Dec 23 2024 07:36:25 GMT+0000 (Coordinated Universal Time)
క్షమాపణలు చెప్పిన అక్షయ్ కుమార్
అక్షయ్ కుమార్ దిగి వచ్చాడు. తాజాగా క్షమాపణలు చెబుతూ ఒక మెసేజీని పెట్టాడు అక్షయ్. నన్ను క్షమించండి అని అక్షయ్..
హైదరాబాద్ : విమల్ పాన్ మసాలా యాడ్.. ఇప్పటికే అజయ్ దేవగన్, షారుఖ్ ఖాన్ ఆ యాడ్ లో నటించగా.. తాజాగా అక్షయ్ కుమార్ కూడా భాగమయ్యారు. దీంతో అక్షయ్ కుమార్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఒకప్పుడు ఫిట్ ఇండియా అంటూ క్యాంపెయిన్ చేసిన అక్షయ్ కుమార్.. ఇప్పుడు ఇలాంటి వాటికి బ్రాండ్ అంబాసిడర్ అవ్వడం చాలా మందికి నచ్చలేదు. తాను పాన్ మసాలా యాడ్స్ చేయనని గతంలో అక్షయ్ చేసిన వీడియో బాగా వైరల్ అయింది. అప్పుడు అలా అన్నాడు.. ఇప్పుడు ఇలా అన్నాడు అంటూ అక్షయ్ కుమార్ కు నెటిజన్లు ఫుల్ గా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు.
దీంతో అక్షయ్ కుమార్ దిగి వచ్చాడు. తాజాగా క్షమాపణలు చెబుతూ ఒక మెసేజీని పెట్టాడు అక్షయ్. నన్ను క్షమించండి అని అక్షయ్ ట్వీట్ చేశాడు. నా అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా మీ స్పందన నన్ను తీవ్రంగా ప్రభావితం చేసింది. నేను పొగాకును ఆమోదించలేదు.. ఆమోదించను కూడానూ..! మీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. విమల్ ఇలాచీతో భాగస్వామ్యంపై నేను వెనక్కి తగ్గానని అక్షయ్ కుమార్ ట్వీట్ చేశాడు. ఈ యాడ్ చేయగా వచ్చిన డబ్బును మంచి కార్యక్రమానికి ఉపయోగిస్తానని అక్షయ్ కుమార్ తెలిపాడు. ఒప్పందం ప్రకారం యాడ్ అయితే టెలికాస్ట్ అవుతుందని.. చట్ట పరమైన వ్యవధి వరకు బ్రాండ్ ప్రకటనలను ప్రసారం చేయనున్నారు.. కానీ నా భవిష్యత్ ఎంపికలలో మాత్రం నేను చాలా జాగ్రత్తగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాను.. అని అక్షయ్ కుమార్ చెప్పాడు.
Next Story