Mon Dec 23 2024 07:31:36 GMT+0000 (Coordinated Universal Time)
గంగూలీ హెల్త్ బులెటిన్ విడుదల.. వైద్యులు ఏమన్నారంటే..
కోల్ కతాలోని వుడ్ ల్యాండ్స్ హాస్పిటల్ లో గంగూలీ చికిత్స తీసుకుంటుండగా.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం
బోర్డ్ ఫర్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కరోనా పాజిటివ్ నిర్థారణ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన అభిమానులు గంగూలీ హెల్త్ కండీషన్ పై ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్యులు గంగూలీ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కోల్ కతాలోని వుడ్ ల్యాండ్స్ హాస్పిటల్ లో గంగూలీ చికిత్స తీసుకుంటుండగా.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆస్పత్రి ఎండీ, సీఈఓ డాక్టర్ రూపాలీ బసూ వెల్లడించారు.
త్వరగా కోలుకోవాలంటూ..
ప్రస్తుతం ఆయనకు మోనోక్లోనల్ యాంటీ బాడీలతో చికిత్స చేస్తున్నామని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. డాక్టర్ దేవిశెట్టి, డాక్టర్ అఫ్తాబ్ ఖాన్ ల సలహాలు తీసుకుంటూ డాక్టర్ సప్తర్షి బసూ, డాక్టర్ సౌతిక్ పాండాల వైద్యుల బృందం గంగూలీకి చికిత్స చేస్తున్నారని రూపాలీ వెల్లడించారు. అలాగే సమయానికి మందులను డోసుల వారీగా ఇస్తున్నట్లు తెలిపారు. కాగా.. గంగూలీ త్వరగా కరోనా నుంచి కోలుకోవాలంటూ అభిమానులు ప్రార్థిస్తున్నారు. ఈ మేరకు మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Next Story