Sun Dec 22 2024 19:51:48 GMT+0000 (Coordinated Universal Time)
లాక్ డౌన్ దిశగానే... ?
మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. దేశంలో కల్లా మహారాష్ట్రలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి.
మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. దేశంలో కల్లా మహారాష్ట్రలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజులోనే 20,181 కేసులు నమోదయ్యాయి. 338 మందికి పైగా కరోనాతో మరణించారు. దీంతో మహారాష్ట్రలో డేంజర్ బెల్స్ మోగుతున్నట్లే నని నిపుణులు సయితం అంగీకరిస్తున్నారు. మహారాష్ట్రలో ప్రస్తుతం కరోనా కేసులు 79,260కి చేరుకున్నాయి.
రోజువారీ కేసులు....
రోజువారీ కేసులు 20 వేలు దాటితే లాక్ డౌన్ విధించాల్సి ఉంటుంది. మరి మహారాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటంతో ప్రభుత్వం ఇప్పటికే నైట్ కర్ఫ్యూతో పాటు విద్యాసంస్థలను మూసివేసింది. పూనే, ముంబయిలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. దీంతో మహారాష్ట్రలో లాక్ డౌన్ దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముంది.
Next Story