Fri Dec 27 2024 20:52:59 GMT+0000 (Coordinated Universal Time)
అదుపులోకే వచ్చింది... కానీ?
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. మూడు వేలకు దిగువన దేశ వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి.
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. మూడు వేలకు దిగువన దేశ వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజులో 2,64,216 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 2,139 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతుండటం శుభపరిణామం. రికవరీ రేటు శాతం 98.76 శాతంగా నమోదయిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
వ్యాక్సిన్ డోసులు...
దేశంలో ఇప్పటి వరకూ 4.45 కోట్ల మందికి కరోనా వైరస్ సోకింది. వీరిలో 4.40 కోట్ల మంది కరోనా వైరస్ కు చికిత్స పొంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ భారత్ లో 5,28,835 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం 26,292 యాక్టివ్ కేసులు భారత్ లో ఉన్నాయని అధికారులు తెలిపారు. యాక్టివ్ కేసుల శాతం 0.06శాతంగా నమోదయింది. ఇప్పటి వరకూ 219.09 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
Next Story