Mon Nov 18 2024 02:32:45 GMT+0000 (Coordinated Universal Time)
వణికిన దేశ రాజధాని
దేశరాజధాని ఢిల్లీని భూకంపం వణికించింది. బలమైన భూ ప్రకంపనలు
దేశరాజధాని ఢిల్లీని భూకంపం వణికించింది. బలమైన భూ ప్రకంపనలు రావడంతో ఢిల్లీ ప్రజలు టెన్షన్ పడ్డారు. అక్టోబర్ 3వ తేదీ మధ్యాహ్నం ఢిల్లీ NCR ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో ఈ భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. దాదాపు నిమిషం పాటు భూమి కంపించింది. భూ ప్రకంపనల ధాటికి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ళు, ఆఫీసుల నుంచి ప్రజలు బయటకు పరుగులు పెట్టారు.
మధ్యాహ్నం 2.25 ప్రాంతంలో తొలిసారి భూ ప్రకంపనలను నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ గుర్తించింది. తొలుత అది 4.6 తీవ్రతతో రికార్డయ్యింది. పది కిలోమీటర్లు లోతులో అది కేంద్రీకృతమై ఉన్నట్లు ఎన్సీఎస్ పేర్కొంది. ఇది గుర్తించిన అరగంటలోపే అంతకంటే ఎక్కువగా 6.2 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. ఇది భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉన్నట్లు ఎన్సీఎస్ గుర్తించింది.ఢిల్లీతో పాటు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ ప్రకంపనలు వచ్చాయి. ప్రాథమిక నివేదికల ప్రకారం రిక్టర్ స్కేల్‌పై 5.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది.
- Tags
- Delhi
- Earthquake
Next Story