Smart Phone Effects: మీరు స్మార్ట్ఫోన్ వాడుతున్నారా? మీకో షాకింగ్ న్యూస్
Shocking: ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేనివారంటూ ఉండరు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ను..
Shocking: ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేనివారంటూ ఉండరు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ను వాడుతున్నారు. అయితే ఫోన్ వాడకం కూడా ఒక ప్రమాదమే. ఈ రోజుల్లో చిన్నారుల నుంచి పెద్దల వరకు స్మార్ట్ఫోన్ వాడేవారి సంఖ్య పెరిగిపోతోంది. కానీ ఫోన్ వాడకం వల్ల కూడా ప్రమాదమేనంటున్నారు నిపుణులు. ఎంతో మంది ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు స్మార్ట్ఫోన్లోనే మునిగిపోతున్నారు. ఫోన్ వాడకం అవసరానికి మించి వాడేస్తున్నారు. ఈ రోజుల్లో ముఖ్యమైనదానికంటే అవసరమైన వాటికే ఎక్కువ వాడుతున్నారు. దీంతో మనకు తెలియకుండానే అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. అయితే ఫోన్ వాడకం ఎంత తక్కువ చేస్తే అంత మంచిదని ఇప్పటికే నిపుణులు పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే.
కానీ స్మార్ట్ ఫోన్ వాడకం రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం త్వరలో ఓ కొత్త పాలసీని తీసుకురాబోతోంది. అదేంటంటే.. ఏ ఫోన్ అయినా 5 సంవత్సరాల కంటే ఎక్కువ వాడకూడదనేది. ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ వాడితే గుండెకు మెదడు, శరీరంలోని వివిధ భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తుండటంతో కేంద్రం ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఫోన్లో రేడిషన్ ఎంత విడుదల అవుతుందనేది చూసుకోవచ్చు. ఐదు సంవత్సరాల కంటే ఎక్కువగా ఫోన్ వాడుతున్నట్లయితే ఆ రేడియేషన్ స్థాయి పెరిగి తీవ్ర అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే మీ ఫోన్లో *#07#ని డయల్ చేసి చూడండి. డయల్ చేయగానే SAR వాల్యువ్ వస్తుంది. అంటే ఏ ఫోన్ అయినా 1.6kgకంటే తక్కువగా ఉండాలి. అంతకంటే ఎక్కువగా ఉన్నట్లయితే ప్రమాదమే. అలాంటి సమయంలో ఆ ఫోన్ని వాడకూడదన్నట్లు. ఒకవేళ వాడినట్లయితే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎవరైతే 5 సంవత్సరాల కంటే ఎక్కువ వాడుతున్నట్లయితే ఆ ఫోన్లో సార్ వాల్యువ్ 1.62W/Kg కంటే ఎక్కువగా ఉంటుందట. ఇలాంటి హెచ్చరికల నేపథ్యంలో త్వరలో కేంద్రం ఈ సరికొత్త పాలసీని తీసుకురానున్నట్లు తెలుస్తోంది.