Tue Nov 05 2024 16:38:19 GMT+0000 (Coordinated Universal Time)
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి.. ఎక్కడుందో తెలుసా ?
చీనాబ్ నదిపై ఈ ఎత్తైన రైల్వే బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం దీని నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే
ప్రపంచంలోని అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి ఇది. ఇంతకీ ఈ బ్రిడ్జి ఎక్కడుందో తెలుసా ? మన దేశంలోనే. భారత్ లోని చీనాబ్ నదిపై ఈ ఎత్తైన రైల్వే బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం దీని నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే ఈ బ్రిడ్జి ఉపయోగంలోకి రానుంది. చీనాబ్ నదిపై నిర్మించిన ఈ రైలు వంతెన ఎత్తు 359 మీటర్లు. పొడవు 1,315 మీటర్లు. దీని నిర్మాణానికి దాదాపు 1500 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ బ్రిడ్జి జమ్మూ, కాశ్మీర్ లోని రియాసి జిల్లాలో ఉంది. ఈ వంతెన బలమైన గాలులతో పాటు, భూకంపాలను కూడా తట్టుకోగలదు.
కాశ్మీర్ లోయను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించడంలో ఈ బ్రిడ్జి ముఖ్యపాత్ర పోషించనుంది. ప్రస్తుతం కాశ్మీర్ నుంచి ఢిల్లీకి ట్రక్కులు రావడానికి 48 గంటల సమయం పడుతోంది. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే 20-22 గంటల సమయంలోనే కాశ్మీర్ సరుకులు ఢిల్లీకి చేరుకుంటాయి. ఈ బ్రిడ్జి వల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా.. సరుకుల రవాణా ఖర్చు కూడా తగ్గుతుంది. ఫలితంగా కాశ్మీర్ నుంచి వచ్చే సరుకుల ధరలు కూడా తగ్గుతాయి. వివిధ రాష్ట్రాల్లో ఉండే ప్రజలు.. ఈ బ్రిడ్జి ద్వారా కాశ్మీర్ కు చోరుకోవచ్చు. తాజాగా భారత రైల్వే మంత్రిత్వ శాఖ అధికారిక ట్విట్టర్ ఖాతాలో బ్రిడ్జి ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
News Summary - Stunning images of Chenab arch bridge, world’s highest rail bridge in J&K
Next Story