Mon Dec 23 2024 04:00:17 GMT+0000 (Coordinated Universal Time)
తీహార్ జైలు నుంచి మరో లేఖ
తీహార్ జైలు నుంచి సుఖేష్ చంద్రశేఖర్ మరో లేఖను బయటకు విడుదల చేశారు
తీహార్ జైలు నుంచి సుఖేష్ చంద్రశేఖర్ మరో లేఖను బయటకు విడుదల చేశారు. తీహార్ జైల్లో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ లు సకల సౌకర్యాలను అనుభవిస్తున్నారని తెలిపారు. తనను జైలులో కొందరు బెదిరిస్తున్నారని చెప్పారు. జైలు అధికారులు కూడా కొందరు వారితో కుమ్మక్కై వ్యవహరిస్తున్నారంటూ సుఖేష్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నారు.
జైలు అధికారులు...
అధికార దుర్వినియోగం చేసిన వారికి జైల్లో పోస్టింగ్ ఇచ్చారన్నారు. సత్యేంద్ర జైన్ కు అత్యంత సన్నిహితుడిని జైలు అధికారిగా నియమించుకు న్నారన్నారు. జైలు అధికారి ధనుంజయ రావత్ ద్వారా తనను బెదిరిస్తున్నారన్నారు. ఎశరు బెదిరించినా తాను వెనక్కు తగ్గనంటూ సుఖేష్ చంద్రశేఖర్ విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.
Next Story