Sun Dec 22 2024 15:55:23 GMT+0000 (Coordinated Universal Time)
మరోసారి వేసవి సెలవులు పొడిగింపు
ఈ మేరకు అధికారుల పర్యవేక్షణలో కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన ఉపకరణాలను, పాఠ్యఫుస్తకాలను..
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలతో పాటు.. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలల వేసవి సెలవులను పొడిగిస్తూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాఠశాలల సెలవులను పొడిగిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యామొళి ప్రకటించారు.
రాష్ట్రంలో మే 29న అగ్నినక్షత్రం ముగిసినా.. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ అధికమవుతుండటంతో విద్యార్థులు ఇబ్బందులకు గురికాకుండా సెలవులను పొడిగిస్తే మంచిదని ముఖ్యమంత్రి స్టాలిన్ సూచించారు. ఈ మేరకే సెలవులను పొడిగించినట్లు ఆయన తెలిపారు. తొలుత వార్షిక పరీక్షల అనంతరం రాష్ట్రంలో 1 నుంచి ఐదు తరగతులకు ఈ నెల 5న, ఆరు నుంచి పదో తరగతి వరకు ఈ నెల 1న పాఠశాలలు ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు అధికారుల పర్యవేక్షణలో కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన ఉపకరణాలను, పాఠ్యఫుస్తకాలను సరఫరా చేశారు. కానీ అధిక ఎండల నేపథ్యంలో.. వేసవి సెలవులను పొడిగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ పాఠశాలల నిర్వాహకులు ప్రభుత్వాన్ని కోరారు.
ఈ నెల 6వ తేదీ వరకు పాఠశాలల సెలవును పొడిగిస్తూ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యామొళి ప్రకటన జారీ చేశారు. జూన్ 1 నుంచి ఎండలు మరింత పెరగడంతో.. తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో 42 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు కూడా ఈ నెల 15 తర్వాతే ఎండలు తగ్గుముఖం పడతాయని, ఆ తర్వాత నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించి వాతావరణం సాధారణ స్థితికి చేరుకుంటుందని తెలిపారు. వేసవి సెలవుల పొడిగింపు పై మంత్రి అన్బిల్ సీఎం స్టాలిన్ తో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. జూన్ 11 వరకూ సెలవులను పొడిగించారు. సీఎం సూచన మేరకు.. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు జూన్ 12 నుంచి, 1 నుంచి ఐదో తరగతి విద్యార్థులకు జూన్ 14 నుంచి పాఠశాలలు పునః ప్రారంభమవుతాయని వెల్లడించారు.
Next Story