Tue Dec 24 2024 01:05:19 GMT+0000 (Coordinated Universal Time)
కేంద్రానికి లక్ష రూపాయల జరిమానా
కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు జరిమానా విధించింది. లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది
కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు జరిమానా విధించింది. లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. ఒక కేసులో కుట్ర పూరితంగా, నిర్లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిందంటూ సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, కొహ్లి కృష్ణమురారీల ధర్మాసనం ఈ మేరకు తీర్పు చెప్పింది. వివరాల్లోకి వెళితే...
బీఎల్ఏ కంపెనీ....
సక్రమంగా అనుమతులను పొందిన మైనింగ్ కంపెనీ పేరును అక్రమ మైనింగ్ కంపెనీల పేర్ల జాబితాలో చేర్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఈ జరిమానా విధించింది. అక్రమ మైనింగ్ కంపెనీల జాబితాలో తమ పేరును చేర్చినందుకు బీఎల్ఏ ఇండ్రస్ట్రీస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి లక్ష రూపాయల జరిమానాను విధించింది.
Next Story