Fri Apr 11 2025 15:13:35 GMT+0000 (Coordinated Universal Time)
మూడు రాజధానులపై విచారణకు?
మూడు రాజధానుల పిటీషన్ పై వచ్చే నెల 28వ తేదీన విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

మూడు రాజధానుల పిటీషన్ పై వచ్చే నెల 28వ తేదీన విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరితగతిన మూడు రాజధానుల అంశాన్ని విచారించాలంటూ సుప్రీంకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుపై స్టే ను కోరుతూ పిటీషన్ వేసింది.
తీర్పు వచ్చిన తర్వాతే...
దీనిపై రైతులు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ రైతుల తరుపున వేసిన పిటీషన్ ను కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించనుంది. అయితే జగన్ త్వరితగతిన విశాఖ నుంచి పాలన చేయాలని భావిస్తున్న తరుణంలో మార్చి 28న విచారిస్తామని సుప్రీంకోర్టు పేర్కొనడంతో తీర్పు వచ్చిన తర్వాతనే ఏప్రిల్ లో జగన్ విశాఖ కు వెళ్లే అవకాశాలున్నాయంటున్నారు.
Next Story