Tue Nov 19 2024 06:44:38 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : నుపుర్‌శర్మపై "సుప్రీం" ఆగ్రహం
నుపుర్ శర్మ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ ప్రజలకు నుపుర్ శర్మ క్షమాపణ చెప్పాలని కోరింది
నుపుర్ శర్మ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ ప్రజలకు నుపుర్ శర్మ క్షమాపణ చెప్పాలని కోరింది. ఆమె వ్యాఖ్యల కారణంగానే దేశంలో అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని, శాంతి భద్రతలకు భంగం కలుగుతున్నాయని సుప్రీంకోర్టు చెప్పింది. ఏ మీడియాలో అయితే నుపుర్‌శర్మ ఆ వ్యాఖ్యలు చేశారో అదే మీడియాకు వచ్చి ఇప్పటికే ప్రజలకు క్షమాపణ చెప్పి ఉండాల్సిందని అభిప్రాయపడింది.
ఢిల్లీ పోలీసులపై...
ిఢిల్లీ పోలీసులపై కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నుపుర్‌శర్మపై ఎఫ్ఐఆర్ దాఖలయినా ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. విచారణ చేయడంలో ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారని పేర్కొంది. ఇప్పటికైనా నుపుర్ శర్మ దేశ ప్రజలకు మీడియా ద్వారా క్షమాపణలను చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉదయ్‌పూర్ వంటి సంఘటనలకు నుపుర్‌శర్మ వ్యాఖ్యలే కారణమని చెప్పింది.
Next Story