Sun Apr 06 2025 19:29:43 GMT+0000 (Coordinated Universal Time)
టీచర్ల పోస్టులు నియామకం రద్దు పై సుప్రీం కీలక తీర్పు
పశ్చిమ బెంగాల్ లో టీచర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

పశ్చిమ బెంగాల్ లో టీచర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలోహైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. 2016 లో పశ్చిమ బెంగాల్ లో ఇరవై ఐదు వేల మంది టీచర్ల నియామకం జరిగింది. ఈ టీచర్ల నియామకంలో అక్రమాలు జరిగాయని కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు.
గతంలో హైకోర్టు...
అయితే గతంలో ఆ ఇరవై ఐదు వేల టీచర్ల నియామకాలను హైకోర్టు రద్దు చేసింది. దీంతో కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్ధించింది. హైకర్టు తీర్పు లో జోక్యం చేసుకునేందుకు సరైన కారణాలు లేవని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మూడు నెలల్లో కొత్త టీచర్ల నియామకాలను చేపట్టాలని ఆదేశించింది.
Next Story