Mon Dec 23 2024 02:19:37 GMT+0000 (Coordinated Universal Time)
Supreme Court : ఎస్బీఐకి షాకిచ్చిన సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు ఎస్బీఐకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎలక్ట్రోరల్ బాండ్స్ వివరాలను రేపటిలోగా వెల్లడించాలని తెలిపింది.
సుప్రీంకోర్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎలక్ట్రోరల్ బాండ్స్ వివరాలను వెల్లడించేందుకు మరింత సమయం తాము ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసుకున్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. రేపటి లోగా విరాళాల వివరాలను వెల్లడించాలని పేర్కొంది. పూర్తి సమాచారాన్ని ఈ నెల 15వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు బహిర్గతం చేయాలని కూడా సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.
వివరాలను వెల్లడించేందుకు....
ఎలక్ట్రోరల్ బాండ్ల వివరాలను వెల్లడించేందుకు జూన్ 30వ తేదీ వరకూ గడువు పొడిగించాలని ఎస్బీఐ దాఖలు చేసిన పిటీషన్ ను కొట్టివేసింది. ఎలక్ట్రోరల్ బాండ్ల పధకాన్ని గత నెల 15వ తేదీన సుప్రీంకోర్టు రద్దే చేసిన సంగతి తెలిసిందే. రాజకీయ పార్టీలకు వివిధ సంస్థల నుంచి అందిన విరాళాల వివరాలను ఈ నెల 6వ తేదీలోగా అందించాలని ఎస్బీఐని సుప్రీం ఆదేశించిన నేపథ్యంలో మరింత గడువు కావాలని ఎస్బీఐ కోరాగా అందుకు న్యాయస్థానం తిరస్కరించింది. విరాళాల వివరాలను ఈ నెల 12వ తేదీ సాయంత్రం లోపు ఎన్నికల కమిషన్ కు అందచేయాలని, ఎన్నికల కమిషన్ ఆ వివరాలను వెల్లడించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.
Next Story